-
పరమ తండ్రే మనకు ఆదర్శం
కుటుంబ బాధ్యతల్లో తండ్రి పాత్ర అత్యంత కీలకమైంది, ప్రాముఖ్యమైంది కూడా. జాతి నిర్మాణంలో కుటుంబ పాత్ర మౌళికమైంది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. ఆ పౌరులు కుటుంబంలోనే తయారవుతారు. ఆ కుటుంబానికి రథసారథి తండ్రి. నాయకుడైనా, నేరస్తుడైనా కుటుంబం నుంచే రావాలి. నీతి నిజాయితీ ఉన్న పౌరులైనా, నీతిమాలిన సంఘవిద్రోహ శక్తులైనా కుటుంబం నుంచే వస్తారు. కుటుంబంలో తండ్రి ఎలాంటి పాలన చేస్తాడు అన్నదాని మీదే పిల్లల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.…
-
ఆయన సన్నిధిని వెతకండి
“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని…
-
పిలుపు లేని పరిచర్య
పిలవని పేరంటానికి వెళ్లకూడదు అన్నది భారతీయుల పట్టింపు. ఆ మాటకొస్తే ఆత్మ గౌరవం ఉన్న ఎవ్వరూ పిలవని పెళ్లికి, పేరంటాలకు వెళ్ళరు. విచిత్రమేమిటంటే, ప్రభువు పిలవకుండానే “పరిచర్య” చేయడానికి విచ్చేసిన ప్రబుద్ధులు ఇప్పుడు మన క్రైస్తవంలో కోకొల్లలు. సోషల్ మీడియా వచ్చాక, “సెలబ్రిటీ సేవకులు” ఎక్కువయ్యాక చాలా మందికి దేవుని పిలుపు వచ్చేసింది. అదేవిటో గానీ ఆ పిలుపు సువార్తికులు గానో, సహాయకులు గానో అస్సలు రాదు. ఐతే పాస్టర్ గానో, లేకపోతే…
-
గురువు పాదాల చెంత…
మన దేశంలో గురు సంప్రదాయం కొత్తేమీ కాదు. అనాది కాలంగా వస్తున్నదే! దైవాన్ని పరిచయం చేసుకోవడానికి, దైవ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి గురువు తప్పనిసరి అన్నది మన వాళ్ళ నమ్మకం. అంచేత గురువు గారిని దేవుడి స్థానానికి ఎత్తేసి “గురు దేవోభవ” అని మొక్కేసే పరిస్థితీ మన సంస్కృతిలో ఉండనే ఉంది. ఇందుకు భిన్నమైన ప్రబోధం చేస్తున్నారు మన ప్రభువు.